హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనల అమలు – ప్రత్యేక డ్రైవ్

Spread the love

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోలీసులు, హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై, రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. మైనర్ డ్రైవింగ్ చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ డ్రైవ్ కొనసాగుతుందని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ తెలిపారు. ప్రయాణ సమయంలో వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఒరిజినల్ వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలను పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై సిసి కెమెరాల ద్వారా కూడా కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. వాహనదారులు తమ వాహనాల నెంబర్ ప్లేట్లను నిబంధనల ప్రకారం ఉంచుకోవాలని, నంబర్ ప్లేట్లు అస్పష్టంగా ఉన్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు బ్రీత్ అనలైజర్ టెస్టులను పెంచారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించడమే తమ ప్రాధాన్యత అని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, నిబంధనలను గౌరవించాలని కోరారు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. వాహనదారులు ప్రయాణ సమయాల్లో ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతకు సహకరించాలని కోరారు. ఈ డ్రైవ్ కొనసాగుతుందని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

రిపోర్టింగ్: జర్నలిస్ట్ రాఘవ బంగారు | 9849171290

Home


Spread the love