RTV Telugu : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను సమగ్రంగా సేకరించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎయిమ్ పట్నాయక్ అక్టోబర్ 14న ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ శాఖల పరిధిలోని వివిధ విభాగాలు, కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను సంబంధిత శాఖాధిపతులు పరిశీలించి సేకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగుల నియామకాలు, ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేయాలని సూచించారు.
ఈ వివరాలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, అక్టోబర్ 31, 2026లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.












Leave a Reply